రుద్రూర్ మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనం శోభయాత్రను సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు విఠలేశ్వర ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర గ్రామంలో ప్రధాన వీధుల గుండా కొనసాగుతోంది. భజనలు కీర్తనలు, వైద్యాల మధ్య గణనాథుడు గ్రామంలో శోభయాత్రగా బయలుదేరాడు. దారి పొడుగునా మహిళలు గణనాధునికి హారతులు ఇచ్చి ముక్కులు తీర్చుకున్నారు. శోభాయాత్రలో గడ్డితో చేసిన ఏనుగు, శివపార్వతుల అలంకరణలో వ్యక్తు,లు గుర్రము, భజన కొనసాగుతోంది. వజ్రోత్సవాల సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము వరకు గ్రామంలో జాతర నిర్వహించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.