ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రా (బి) గ్రామ పంచాయతీ పరిధిలోని రఘు గూడ, మంకు గూడ గ్రామానికి చెందిన పలువురు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గులాబీ జెండా ఎగిరే దిశగా అడుగులు వేస్తున్నామని కేసీఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత ప్రజలు తీసుకున్నారని అన్నారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని తెలుసుకొని వారి వెంటే నడవాలని నిర్ణయించుకున్నామని అన్నారు