నారాయణ పేట పట్టణ శివారులోని కొండారెడ్డిపల్లి చెరువును ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం ఫర్నిచర్ రెడ్డి సందర్శించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి నాలుగున్నర గంటల సమయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆర్. శివారెడ్డి ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.