మెదక్ జిల్లా పాపన్నపేట మండలంకొత్తపల్లిలో ఘనంగా భారీ వినాయక నిమర్జనం పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో వరసిద్ధి వినాయక యూత్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన 19 అడుగుల భారీ వినాయకుని నిమర్జనము శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇంత పెద్ద వినాయకుని విగ్రహం పాపన్నపేట మండలంలోని ప్రప్రథమంగా నిలిచింది. యువజన సంఘం యువకులు ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి 200 కిలోమీటర్ల కోరుట్ల నుండి నాలుగు రోజులు శ్రమించి కొత్తపల్లికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా వారిని గ్రామ పెద్దలందరూ అభినందించారు. భారీ వినాయకుని చూడటానికి మండల పరిధిలోని ఆయా గ్రామాలకు భక్తులు తరలివచ్చి పూజించారు