విద్యార్థి దశ చాలా కీలకమైనదని.. ఇప్పుడు ఎంత కష్ట పడితే అంత మంచి భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.శనివారం లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల లోని జడ్పీ హై స్కూల్ ని కలెక్టర్ ఆకస్మికం గా సందర్శించారు.ముందుగా ఉపాధ్యాయుల హాజరు ను పరిశీలించి..అనంతరం పదవ తరగతి, ప్రి ప్రైమరి విద్యార్థుల తో కలెక్టర్ మాట్లాడారు.ప్రి ప్రైమరీ తరగతి లోకి వెళ్లిన కలెక్టర్... బోర్డు మీద ఉన్న పదాల ను విద్యార్థులు కు భోదించి,వారితో చదివించారు అలాగే వారి అభ్యాసన సామర్ధ్యలను పరిశీలించారు.