విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా చనుగోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడికొండ గ్రామానికి చెందిన రైతు మల్లయ్య వయసు 50 సంవత్సరాలు కరెంట్ షాక్ తో మృతి చెందారు. ఉమ్మెంతల్ గ్రామానికి చెందిన మరో రైతు అడవి పందుల నుండి తన మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ విద్యుత్ తీగలు అమర్చాడు ఆ విషయం తెలియని మల్లయ్య పొలంలోకి వెళ్ళగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శుక్రవారం తెలిపారు.