ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర విద్యార్థి సంఘం కార్యదర్శి తులసిరామ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు రోడ్డుపై భిటాయించి ధర్నా చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు.