గుర్తుతెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని కత్తులతో హతమార్చి న ఘటన ఏలూరు రూరల్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఏలూరు రూరల్ మండలం వైయస్సార్ కాలనీకి చెందిన పోడూరి రాజేష్ 42 ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు కార్లో వచ్చి అతని బయటకు పిలిచి అతనిపై కత్తులతో దాడి చేశారు అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఆదివారం సాయంత్రం 5:00 ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న పోలీసులు