మెట్పల్లి GST తగ్గింపుతో వారికి లాభం మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో మెట్ పల్లి పట్టణంలో శుక్రవారం BJP శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జీఎస్టీ మినహాయింపుపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కొమ్ముల రాజ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ.. జీఎస్టీ మినహాయింపులతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు లాభం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భోగ గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.