సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల నుంచి ఖమ్మం జిల్లా కల్లూరు వైపు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి కల్లూరు లోని నాగార్జునసాగర్ ఎడమ కాలువలో పడిపోయింది. ఈ సందర్భంగా శుక్రవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదాన్ని గమనించిన స్థానికులు స్పందించి తాడు సహాయముతో కారును బయటికి లాగారు. లోపల చిక్కుకున్న డ్రైవర్ను క్షేమంగా బయటికి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారులో డ్రైవర్ ఒక్కరే ఉండడంతో ప్రాణం నష్టం తప్పింది.