టిడిపి, వైసిపి పార్టీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలను నిర్వీర్యం చేశాయని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం కుమార్ అన్నారు. ఆదివారం విజయవాడలో బిఎస్పి రాష్ట్ర ఇంచార్జిల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ.. రాబోవు ఎంపీటీసీ ఎన్నికల్లో బిఎస్పి బలంగా పోటీ చేసి రాష్ట్రంలో అధికార పార్టీ మెడలు వంచాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు