కిషన్ బాగ్ డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ఆదివారం మధ్యాహ్నం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అన్ని పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు ప్రజలకు మందులను కూడా పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు.