శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని వినాయక ప్రతిమలను ఏర్పాటు చేస్తున్న మండపాలను కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి ఆదివారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మండప నిర్వహకులకు పలు సూచనలు చేశారు. మండపాలను ఏర్పాటు చేస్తున్న వారు తప్పనిసరిగా అనుమతి ఇబ్బందాలన్నారు. నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో పూర్తిచేసేలా పోలీసులకు సహకరించాలని తెలియజేశారు.