శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రంలో అడుగడుగున భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేశారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందా నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకొని అక్కడి నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభన తీసుకువచ్చారు.