విద్య అంటే కేవలం పాఠ్యాంశాల బోధన ఒక్కటే కాదని,మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తులో విద్యార్థుల కెరీర్ కి అవసరమయ్యే వివిధ అంశాల్లో పాఠశాల స్థాయి నుండే అవగాహన కల్పిస్తేనే అది సమగ్రమైన విద్య అవుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.ఇందుకు దిక్సూచి అనే కార్యాచరణ ను రూపొందించి విద్యార్థులకు అవసరమయ్యే వివిధ ప్రాధాన్యాత అంశాల్లో ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నరన్నారు.ప్రాథమిక స్థాయి నుండి ఇంటర్ వరకు విద్యార్థులకు, ప్రతీ రోజు ఒక్కో టాపిక్ పైన అర్ద గంట సేపు ఈ దిక్సూచి పిరియడ్ లో ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగహన కల్పిస్తున్నరన్నారు.