శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం హాల్ట్ - తిలారు రైల్వే స్టేషన్ ల మధ్యలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించి పలాస జిఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జిఆర్పి ఎస్ ఐ షరీఫ్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే పలాస జిఆర్పి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.