ఈనెల 25న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే అఖిలభారత ఐక్య రైతు సంఘం బహిరంగ సభకు భారీగా తరలివెళ్లి విజయవంతం చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం జన్నారం మండల కార్యదర్శి పురంశెట్టి బాపు పిలుపునిచ్చారు. శనివారం జన్నారం మండలం చింతగూడ గ్రామంలో బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను వారు విడుదల చేశారు. ఈ మహాసభలు ఈనెల 25, 26 వ తేదీలలో ఘనంగా నిర్వహిస్తున్నామని, రైతులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.