రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం ఉదయం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని మాసాపేట వద్ద మాండవ్య నది మరమ్మతు మరియు సుందరీకరణ పనులకు రూ.30 లక్షల రూపాయల నిధులతో పూజలు చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాయచోటి మున్సిపాలిటీని రాష్ట్రంలో నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, మాసాపేట, పాత రాయచోటి ప్రాంతాల టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.