బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. మామడ మండలం పొన్కల్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులకు బాల్య వివాహాల నియంత్రణపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులతో పాటు సమాజంలో చాలా మార్పు రావాలన్నారు. బాల్యవివాహాలు జరుగుతున్న విషయం ఎవరికి తెలిసినా వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.