దేశం గర్వించదగిన గొప్ప పార్లమెంటేరియన్ సీతారాం ఏచూరి అని సిఐటియు జిల్లా కార్యదర్శి నాయుడు, మరో నాయకుడు కోరాడ ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంతో పాటు పాచిపెంట, మక్కువలో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయుడు, ఈశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, విద్యా హక్కు చట్టం కోసం పార్లమెంట్లో గళమెత్తిన గొప్ప నాయకుడు ఏచూరి అని కొనియాడారు. ఆయన లేని లోటు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.