పమిడిముక్కల మండలం చోరగుడి గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో మంచినీటి బోరు పనులకు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.