ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ – సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నేడు సోమవారం రోజున మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించారు. పారితోషక విధానం రద్దుచేసి ఫిక్స్డ్ వేతనం రూ.l18000 చెల్లించాలని,పిఎఫ్, ఈఎస్ఐ, అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషకాన్ని రాష్ట్ర ప్రభుత్వం యధావిధిగా అమలు చేయాలని, ఆశాలకు ప్రతి సంవత్సరం 20 రోజుల వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని, ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని, ఆశాలకు పని భారం తగ్గించాలని, పారితోషకం లేని పనులు చేయించకూడదని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్