ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరప్ప గడ్డలో దోమ మహేందర్ కేబుల్ వైర్ తో ఉరి వేసుకొని మృతి చెందాడు. జనగాం జిల్లా కోటిగల్లు కూచేందిన మహేందర్, ఉప్పల్ లోని బీరప్ప గడ్డలో ఉంటూ రాణిగంజ్లో ఆర్వో వాటర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం హనుమకొండకు చెందిన గీతాంజలితో వివాహం జరిగింది. భార్య గీతాంజలి ఉప్పల్లో నీవు ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.