మామిడికుదురు మండలంలో వైనతేయ గోదావరి నది కోత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పెదపట్నం, అప్పనపల్లి, పెదపట్నంలంక, బి.దొడ్డవరం, పాశర్లపూడి గ్రామాల్లో నదీ కోత విపరీతంగా పెరిగింది. ఇటీవల వచ్చిన వరదల వల్ల పలు కొబ్బరి చెట్లు కూలిపోవడంతో పాటు, సారవంతమైన భూములు నదిలో కలిసిపోయాయి. నది కోత నివారణకు రివిట్మెంట్, గ్రోయన్స్ నిర్మించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.