శ్రీ సత్యసాయి జిల్లా నూతన కలెక్టర్గా నియమితులైన శ్యాంప్రసాద్ శనివారం మధ్యాహ్నం పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తో పాటు ఇన్ఛార్జ్ డీఆర్ఓ రామసుబ్బయ్య, ఆర్డీవోలు, తహశీల్దార్లు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, ఘన స్వాగతం పలికారు. అనంతరం శాంతి భవన్లో విశ్రాంతి తీసుకొని, సాయంత్రం సత్యసాయి మహా సమాధిని దర్శించుకోనున్నట్లు అధికారులు తెలిపారు.