శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండల పరిధిలోని వెంకటగిరి పాల్యం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన ఎల్లమ్మ మాత నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. వెంకటగిరి పాల్యంలో నూతనంగా ఎల్లమ్మ దేవి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రి సవితను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.