ఉమ్మడి నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి సమీపంలో తెలుగు గంగ కాలువకు గండి పడే ప్రమాదం తలెత్తింది. సోమశిల జలాశయం నుంచి కండలేరు డ్యామ్ కు రోజూ 1 టీఎంసీ నీరు పంపుతున్నారు. ఎక్స్టెన్షన్ పనులు 30% వరకే నిలిచిపోవడంతో సమస్యలు ఎక్కువయ్యాయి. వరద నీరు అధికంగా రావడంతో పలు చోట్ల గండ్లు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 12.6 కిలోమీటర్ వద్ద ప్రమాద సూచనలు కనిపించడంతో అధికారులు హుటాహుటిన ఇసుక బస్తాలతో మరమ్మతులు చేపట్టారు.