జిల్లాల యూరియా నిలువలు అందుబాటులో ఉన్నాయని యూరియా నిరంతరం సరఫరా జరుగుతుందని రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులతో అన్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ స్తానిక గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో వివిధ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్ ఎక్కడికక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడి యూరియా స్థితిగతులపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా నిరంతరం కొనసాగుతుందని ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా కలెక్టర్ వారికి వివరించారు.