ఎరువుల బ్లాక్ మార్కెట్ పై ఈ నెల 9 వ తేదీ అన్నదాత పోరు కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగిందని మాజీమంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శనివారం సాయంత్రం నగరంలోని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ తొమ్మిదో తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీవో కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. తక్షణమే యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.