సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ లో ప్రజలు విస్తృతంగా పాల్గొని, తమ పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా జడ్జి శ్రీమతి రత్న పద్మావతి కోరారు. .శనివారం జిల్లా కోర్టులో మధ్యాహ్నం 4-30 గంటల ప్రాంతంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, పీపీలు, న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ.. నేషనల్ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్య లో కేసులను పరిష్కరించాలని కోరారు. రాజీకి అనుకూలమైన అన్ని క్రిమినల్, సివిల్ కేసుల ను ఇరు పార్టీల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని అన్నారు....