వినాయక నిమజ్జనం.. అల్లర్లు చేస్తే కేసులు తప్పవు: ఎస్ఐ జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం ఎస్ఐ అనిల్ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా చేసుకోవాలని సూచించారు. నిమజ్జన సమయంలో శోభాయాత్రలలో అల్లర్లు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లే, నిమజ్జనం కూడా క్రమబద్ధంగా, ఎలాంటి అల్లర్లు లేకుండా చేసుకోవాలని వినాయక ఉత్సవ కమిటీలకు సూచించారు. డిజెలు, అధిక శబ్దంతో ఇబ్బంది కలిగించవద్దని, ఎదురెదురు శోభాయాత్రలతో గొడవలకు దిగేవారిపై కేసులు తప్పవని తెలిపారు.