పాణ్యం మండలంలోని విజయానికేతన్ సమీపంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుగాలిమెట్ట వద్ద మోడల్ స్కూల్ లో సైన్స్ టీచర్ గా పనిచేస్తున్న సౌజన్య ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తన పిల్లలను విజయానికేతన్ పాఠశాలలో వదిలివెళ్లిందుకు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదంలో జరిగిందన్నారు. గాయపడిన వారిని సమీప హాస్పిటల్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.