రామంతపూర్ లో లిక్కర్లోడుతో వెళ్తున్న లారీ ఆజ్ఞ ప్రమాదానికి గురైంది. స్ట్రీట్ నెంబర్ 8 మీదుగా వెళుతున్న లారీకి కిందకు వేలాడుతున్న వైర్లు తగిలి, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లారీ డ్రైవర్ వాహనం నుంచి దిగాడు. అప్పటికే కొన్ని మందు సీసాలు మంటల్లో కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కొందరు మద్యం సీసాల కోసం ఎగబడ్డారు.