చింతపల్లి పాడు గ్రామానికి చెందిన తెలుగు ఫ్రెషషనల్ వింగ్ పర్చూరు నియోజకవర్గ అధ్యక్షులు వెంపరాల జితేంద్రకుమార్ అంతిమయాత్రను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని జితేంద్ర పవన్ కుమార్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అధైర్యపడవద్దని అండగా ఉంటానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వారికి భరోసా ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉంటానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి జితేంద్ర పవన్ కుమార్ లేని లోటు తీరనదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.