తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ శాసనసభ శాసనమండలి సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులతో శుక్రవారం మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తో కలిసి భద్రత ఏర్పాట్లు వరుసతులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్చించారు. సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని స్పీకర్ అన్నారు.