ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై జిల్లా సౌదలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రోడ్డు భవనాలు సినిమాట్రోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా 2005లో శ్రీకారం చుట్టిన ఎస్ఎల్వి సిస్వరంగం పూర్తయితే కృష్ణానదిలో కేటాయించిన నీటిని గ్రావిటీ ద్వారా అందుకోవచ్చు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టుల పనుల స్థితిగతులు రైతులకు నీతి సరఫరా సాగునీటి సదుపాయాలు తాగునీటి అవసరాలపై మంత్రులు అధికారులతో సమగ్రంగా చర్చించారు.