Parvathipuram, Parvathipuram Manyam | Aug 29, 2025
ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న ఒక మహిళతో పాటు మరో వ్యక్తి బస్సులో సీటు కోసం బూతులు తిట్టుకుంటూ, చెప్పులతో కొట్టుకున్న వీడియో సామాజిక మద్యమాల్లో వైరల్ గా మారింది. బొబ్బిలి నుండి విశాఖపట్నం వెళుతున్న ఆర్టీసీ బస్సులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్టు చెబుతున్నారు. సీటు కోసం తాను చున్నీ వేశానని, సీటులో నుండి లేవాలని ఓ మహిళ ఆసీట్లో కూర్చున్న వ్యక్తితో గొడవ పడగా, వారి మధ్య వివాదం ముదిరింది. బండ బూతులు తిట్టుకునే వరకు వెళ్ళింది. ఇంతలో సీట్లో కూర్చున్న వ్యక్తిపై ఆ మహిళ విచక్షణారహితంగా దాడి చేయగా, కాసేపటికి చెప్పులతో ఇరువురు కొట్టుకున్నారు.