బంగారుపాల్యం మండలం రాగిమానుపెంట గ్రామానికి చెందిన వీర జవాన్ కార్తిక్ యాదవ్ జయంతి సందర్భంగా, ఆయన స్ఫూర్తిని స్మరించుకుంటూ విద్యార్థులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. గత సంవత్సరం ఉగ్రవాదులతో పోరాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కార్తిక్ యాదవ్ జయంతి పురస్కరించుకుని సెప్టెంబర్ 13న అమర్ జవాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బంగారుపాల్యం ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాగిమానుపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలను నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులను మెమెంటోలు, సర్టిఫికెట్లతో వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా సత్కరించారు.