సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని ఆందోల్ మండలం అల్మాయిపేట గ్రామం వద్ద మాంజీర నది వంతెన పై ఆదివారం భారీగా వరద నీరు ప్రవహిస్తుంది భారీ వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టుకు ఏడ్గేర్లు ఎత్తివేయడంతో వరదనీరు ఉదృతి పెరిగింది.కాగా ఇవాళ సాయంత్రం వంతెన పై నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు పర్యటకులను ఆకర్షించాయి. నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.