ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నేడు హైదరాబాద్ ,విద్యానగర్ లోని మార్క్స్ భవన్ లో జరిగింది.ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎన్ వి రాకేష్, పెద్దింటి రామకృష్ణ లు మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. పట్టణ ప్రాంతలోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల చేరువ వరకు వెళ్లాయంటే యువత , విద్యార్థిలు పెద్ద ఎత్తున బలవుతున్నారని అర్థం చేసుకోవచ్చు. వీటి నియంత్రణకై ప్రభుత్వాలు బాధ్యతగా పనిచేయడం లేదనేది వాస్తవం.