కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందడంతో బంధువులు ఆందోళన చేపట్టారు. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామానికి చెందిన అఖిల పురిటినొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం అర్ధరాత్రి ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చారు. మొదటి కంపు కావడంతో నొప్పులు భరించలేకపోతున్నానే ఆపరేషన్ బిడ్డను బయటకు తీయాలని చెప్పిన ఆసుపత్రి వైద్యులు వినిపించుకోలేదన్నారు.. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.