నగరవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షానికి నగరంలో పలుచోట్ల గుంతలు మయంగా రోడ్లు అయ్యాయి. ఈ సందర్భంగా నానక్రాం గూడ లో రోడ్లు గుంతల మయంగా అవ్వడంతో ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. శుక్రవారం మధ్యాహ్నం రోడ్డుకు కాంక్రీట్ ప్యాచ్ పనులను చేపట్టారు. రోడ్డు పనులు చేపట్టడంతో ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ వాహనదారులు నెమ్మదిగా పయనించాలని వారు సందర్భంగా సూచించారు.