కంకిపాడు లో వినాయక చవితి వేడుకలకు అందరూ సహకరించాలని కంకిపాడు సీఐ మురళీకృష్ణ అన్నారు. గురువారం ఆయన కంకిపాడులో మాట్లాడుతూ ఈనెల 27వ తారీఖున జరగబోయే వినాయక చవితి ఉత్సవాలకు మండపాల వద్ద కమిటీ సభ్యులు నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కంకిపాడు సిఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు సులభతరం చేశామని, మండపాల వద్ద గాని, ఊరేగింపులలో డీజే పాటలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.