కోడుమూరు పట్టణంలో నలుగురు చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది. చిన్నారులు ఈనెల 24 నుంచి కనిపించడం లేదని సమాచారం. కనిపించకుండా పోయినవారు వినీల, నందిని, చరణ్, అనిల్ గా గుర్తించారు. వీరంతా మైనర్లు. సహజీవనం చేస్తున్న ఓ జంట కూడా అదే రోజు నుంచి కనిపించకపోవడంతో బాధిత తల్లిదండ్రులు వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.