భారతీయులందరినీ ఐక్యం చేసేందుకు బాలగంగాధర్ తిలక్ వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారని ప్రముఖ వేద ప్రచారకర్త జ్యోతి శ్రీ ఆర్య అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 75వ వినాయక నవరాత్రి ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వినాయక చవితి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ప్రజలంతా ఐక్యమత్యంతో ఉండాలని దేశంలో భక్తి భావం పెరిగిపోయే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ, మహిళ అధ్యక్షురాలు ఎనిశెట్టి వాణి అశోక్ తదితరులు పాల్గొన్నారు.