ఏర్పేడు నూతన ఎంపీపీగా శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు ఏర్పేడు మండల ఎంపీపీగా శుక్రవారం జమ్మల శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది వరకు ఎంపీపీగా ఉన్న గీత రాజీనామ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైస్ ఎంపీపీగా ఉన్న శ్రీనివాస యాదవ్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన చేత ఎంపీడీవో సౌభాగ్యం ప్రమాణ స్వీకారం చేయించారు.