టెక్కలిలో శనివారం పలు ఎరువుల దుకాణాల వద్ద అధికారుల ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న కొన్ని ఎరువుల షాపుల్లో యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తూ, అధిక ధరలకు ఎరువులను, పురుగుమందులను విక్రయిస్తున్నారని ఆవేదన సాగుదారుల వ్యక్తం చేశారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి ఎరువుల దుకాణాల పరిశీలనకు వెళ్లిన సమయంలో అప్పటికే వచ్చిన రైతులు తమ సమస్యలను రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులకు తెలియజేశారు.