దొడ్డిదారిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్న కేంద్రం అంటూ ఆరోపించిన CITU నేత విశాఖ స్టీల్ ప్లాంట్ను దొడ్డిదారిన ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం కుయుక్తులు పన్నుతోందని సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు విమర్శించారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీస్ పేరుతో స్టీల్ ప్లాంట్ను ముక్కలు చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రజలు తమ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.