సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి బాలుర గురుకులంలో డార్మెంటరీ భవనం కుప్పకూలింది. భవనం కూలిన సమయంలో అక్కడ విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్న భోజనం కోసం గంట మోగడంతో విద్యార్థులు డార్మెటరీలో ప్లేట్లు తెచ్చుకునేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు.గాయపడిన ముగ్గురు విద్యార్థులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన విషయం తెలుసుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించడంతో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, ఎస్పీ పంకజ్ గురుకులం సందర్శించి వివరాలను తెలుసుకున్నారు.