చిత్తూరు నగరంలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో మాజీ మేనేజర్ ఉదయరాజ్ ఉద్యోగిని రేవతి కలిసి 40 నకిలీ ఐడీలను సృష్టించి 17 లక్షల రూపాయలు రుణం స్వాహా చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంస్థ ఉద్యోగి ఫక్రుద్దీన్ ఈ విషయాన్ని గుర్తించి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు న్యాయస్థానం సూచనల మేరకు చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.